తేది.23-10-2025, గురువారం నాడు ఉదయగిరి మండల కేంద్రంలోని SMGR అగ్రికల్చరల్ కాలేజి ప్రాంగణంలో జాబ్ మేళా..!
నిరుద్యోగ యువతీ యువకులు సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ సారధ్యంలో గురువారం ఉదయగిరి మండల కేంద్రంలోని SMGR అగ్రికల్చరల్ కళాశాల ప్రాంగణంలో పలు కంపెనీలు, వారి మేనేజర్లతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన యువకులు https://naipunyam.ap.gov.in/user registration వెబ్ సైట్లింక్ నందు నమోదు చేసుకోవాలని తెలిపారు. పదవ తరగతి పైబడి చదివిన 18 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ చక్కని సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.
కావున మన తెలుగు దేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తమ తమ పంచాయతీలోని నిరుద్యోగ యువతీ యువకులకు తెలియపరచి ఈ జాబ్ మేళాలో పాల్గొని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా చూడవలసినదిగా కోరడమైనది.
ఇట్లు…
ఎమ్యల్యే కాకర్ల సురేష్ గారి క్యాంపు కార్యాలయం,
ఉదయగిరి నియోజకవర్గం.

