Tuesday, 24 March 2026
  • Home  
  • బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మ దహనం
- కామారెడ్డి

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి 17 అక్టోబర్ పున్నమి ప్రతినిధి : సామాజిక, రాజ్యాంగ, న్యాయబద్ధమైన బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం,ఉప్పల్వాయి గ్రామంలో బీసీ నాయకులు, ప్రజలు శుక్రవారం బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్ర హాన్ని వ్యక్తం చేశారు. ‘జై బీసీ, జై జై బీసీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయ కులు మాట్లాడుతూ, అనేక దశాబ్దాలుగా అణచి వేయబడ్డ బీసీ వర్గాల సామాజిక, రాజకీయ అభి వృద్ధి కోసం ఉద్దేశించిన 42 శాతం బీసీ రిజర్వేష న్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి, తీర్మానం చేసి అమ లు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధిని వ్యతిరేకించే శక్తులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలు, ముఖ్యంగా బీసీ సమాజం ఈ కుట్రలను అర్థం చేసుకొని, ఇకనైనా మేల్కొని చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. తమ హక్కులను సాధించుకోవడానికి మరో పెద్ద ఉద్య మాన్ని, పోరాటాలను నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని వారు పేర్కొన్నారు.రేపు రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని పిలుపు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న బంద్‌లో అన్ని బీసీ సంఘా లు, ప్రజా సంఘాలు, యువత, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బీసీ నాయకులు పిలుపునిచ్చారు. బీసీలందరూ ఏకమై, ఐక్యత చాటి, తమ హక్కుల సాధన కోసం కలిసి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్ర మంలో గ్రామ బీసీ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి 17 అక్టోబర్ పున్నమి ప్రతినిధి :

సామాజిక, రాజ్యాంగ, న్యాయబద్ధమైన బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం,ఉప్పల్వాయి గ్రామంలో బీసీ నాయకులు, ప్రజలు శుక్రవారం బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్ర హాన్ని వ్యక్తం చేశారు. ‘జై బీసీ, జై జై బీసీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయ కులు మాట్లాడుతూ, అనేక దశాబ్దాలుగా అణచి వేయబడ్డ బీసీ వర్గాల సామాజిక, రాజకీయ అభి వృద్ధి కోసం ఉద్దేశించిన 42 శాతం బీసీ రిజర్వేష న్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి, తీర్మానం చేసి అమ లు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధిని వ్యతిరేకించే శక్తులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలు, ముఖ్యంగా బీసీ సమాజం ఈ కుట్రలను అర్థం చేసుకొని, ఇకనైనా మేల్కొని చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. తమ హక్కులను సాధించుకోవడానికి మరో పెద్ద ఉద్య మాన్ని, పోరాటాలను నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని వారు పేర్కొన్నారు.రేపు రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని పిలుపు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న బంద్‌లో అన్ని బీసీ సంఘా లు, ప్రజా సంఘాలు, యువత, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బీసీ నాయకులు పిలుపునిచ్చారు. బీసీలందరూ ఏకమై, ఐక్యత చాటి, తమ హక్కుల సాధన కోసం కలిసి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్ర మంలో గ్రామ బీసీ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.