పున్నమి ప్రతినిధి
ఖమ్మం
భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా స్థాయి సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిధి గా
దక్షిణ భారత ప్రాంతీయ సంఘటన మంత్రి దొనూరి రాము విచ్చేసి మాట్లాడుతూ జిల్లాలోని చాలా గ్రామాల్లోని పొలాలకు వెళ్ళడానికి సరైన దారులు లేకపోవడం వలన, అలాగే ఆక్రమణలో ఉన్న డొంకలను కూడా సరిచేసి మా రైతులకు దారుల కల్పించాలి అని డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ 45 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం రైతుల సమస్యల పోరాడుతుందని, పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే అన్న ఏకైక నినాదంతో బీకేయస్ పని చేస్తుంది అని తెలిపారు…
బీకేయస్ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి రాజి రెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ సకాలంలో సరైన, నాణ్యమైన విత్తనాలతో పాటు , ఎరువులను అందించి రైతులకు సరైన న్యాయం చేయాలని, జిల్లాలోని వేసంగి పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు అన్ని కాలువలకు సరైన మరమత్తులు చేసి ప్రతి ఎకరానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షులు పగడవరపు శ్రీనివాస రావు మాట్లాడుతూ రైతులందరికీ విద్యుత్ సమస్య చాలా తివ్రమైనది ఉంది అని , చాలా పొలాలో లూజ్ వైర్లు,స్తంభాల సమస్యలు అలాగే సకాలంలో పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మత్తులు చేసి ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యుత్ ను అందించాలని , రైతులను కరెంట్ కోతల నుంచి కాపాడాలి అని డిమాండ్ చేశారు…
ప్రతీ గ్రామంలో పొలాల్లోకి వెళ్ళే ప్రతి దారిని బీటి రోడ్లుగా అభివృద్ధి చేసి రైతుల సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళటానికి అవసరమైన వెడల్పుగా ప్రతీ దారిని అభివృద్ధి చేయాలని జిల్లా సమావేశంలో తీర్మానం చేశారు
ఈ కార్యక్రమంలో బీకేయస్ జోనల్ అధ్యక్షులు మల్లెంపాటి రమేష్, జోనల్ కార్యదర్శి మందనపు రామారావు జిల్లా కార్యదర్శి తాళ్లూరి శ్రీనివాస రావు రైతులు పాల్గొన్నారు.

గ్రామంలోని ప్రతి రైతు పొలానికి వెళ్లేలా దారులు ఏర్పాటు చెయ్యాలి : దొనూరి రాము
పున్నమి ప్రతినిధి ఖమ్మం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా స్థాయి సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిధి గా దక్షిణ భారత ప్రాంతీయ సంఘటన మంత్రి దొనూరి రాము విచ్చేసి మాట్లాడుతూ జిల్లాలోని చాలా గ్రామాల్లోని పొలాలకు వెళ్ళడానికి సరైన దారులు లేకపోవడం వలన, అలాగే ఆక్రమణలో ఉన్న డొంకలను కూడా సరిచేసి మా రైతులకు దారుల కల్పించాలి అని డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ 45 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం రైతుల సమస్యల పోరాడుతుందని, పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే అన్న ఏకైక నినాదంతో బీకేయస్ పని చేస్తుంది అని తెలిపారు… బీకేయస్ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి రాజి రెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ సకాలంలో సరైన, నాణ్యమైన విత్తనాలతో పాటు , ఎరువులను అందించి రైతులకు సరైన న్యాయం చేయాలని, జిల్లాలోని వేసంగి పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు అన్ని కాలువలకు సరైన మరమత్తులు చేసి ప్రతి ఎకరానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు పగడవరపు శ్రీనివాస రావు మాట్లాడుతూ రైతులందరికీ విద్యుత్ సమస్య చాలా తివ్రమైనది ఉంది అని , చాలా పొలాలో లూజ్ వైర్లు,స్తంభాల సమస్యలు అలాగే సకాలంలో పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మత్తులు చేసి ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యుత్ ను అందించాలని , రైతులను కరెంట్ కోతల నుంచి కాపాడాలి అని డిమాండ్ చేశారు… ప్రతీ గ్రామంలో పొలాల్లోకి వెళ్ళే ప్రతి దారిని బీటి రోడ్లుగా అభివృద్ధి చేసి రైతుల సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళటానికి అవసరమైన వెడల్పుగా ప్రతీ దారిని అభివృద్ధి చేయాలని జిల్లా సమావేశంలో తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో బీకేయస్ జోనల్ అధ్యక్షులు మల్లెంపాటి రమేష్, జోనల్ కార్యదర్శి మందనపు రామారావు జిల్లా కార్యదర్శి తాళ్లూరి శ్రీనివాస రావు రైతులు పాల్గొన్నారు.

