నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి )
పెండింగ్ లో ఉన్న సదరం కేసులను వచ్చే నెలలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు.
గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించే సదరం శిబిరాన్ని సందర్శించారు. సదరం క్యాంపులను ఆసుపత్రిలోని పాత భవనంలో నిర్వహిస్తుండగా, నూతన భవనంలోకి మార్చాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కొత్త భవనానికి సంబంధించిన పార్టీషన్, ఎలివేషన్ పనుల వల్ల శిబిరం మార్చడం సాధ్యం కాలేదని డి ఆర్ డి ఓ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.పాత భవనంలోని ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని సదరం క్యాంపుల నిర్వహణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేగాక పెండింగ్ లో ఉన్న 2564 సదరం దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల నాటికి క్యాంపుల నిర్వహణ,పరిష్కారం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సదరం దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల నాటికి పరిష్కరించాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) పెండింగ్ లో ఉన్న సదరం కేసులను వచ్చే నెలలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించే సదరం శిబిరాన్ని సందర్శించారు. సదరం క్యాంపులను ఆసుపత్రిలోని పాత భవనంలో నిర్వహిస్తుండగా, నూతన భవనంలోకి మార్చాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కొత్త భవనానికి సంబంధించిన పార్టీషన్, ఎలివేషన్ పనుల వల్ల శిబిరం మార్చడం సాధ్యం కాలేదని డి ఆర్ డి ఓ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.పాత భవనంలోని ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని సదరం క్యాంపుల నిర్వహణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేగాక పెండింగ్ లో ఉన్న 2564 సదరం దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల నాటికి క్యాంపుల నిర్వహణ,పరిష్కారం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

