Sunday, 22 March 2026
  • Home  
  • వనరులు దోచి పెడుతున్న కూటమి ప్రభుత్వం.. -రాష్ట్ర ప్రజల పై కనీస ప్రేమ లేని ప్రభుత్వం -కోస్టల్ కారిడార్ రాసి ఇచ్చేయటానికి సన్నాహాలు :-జమ్మలమడక
- కాకినాడ

వనరులు దోచి పెడుతున్న కూటమి ప్రభుత్వం.. -రాష్ట్ర ప్రజల పై కనీస ప్రేమ లేని ప్రభుత్వం -కోస్టల్ కారిడార్ రాసి ఇచ్చేయటానికి సన్నాహాలు :-జమ్మలమడక

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 1, ఏదైనా రాష్ట్రం లేక దేశం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ లభించే వనరులను సద్వినియోగం చేసుకోవాలనీ తద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అలా ఉన్న వనరులన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా ఇచ్చేస్తూ రాష్టానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయని రాష్ట్ర వై సి పి మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మలమడక నాగమణి ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా పలు ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో పలు ఖనిజాల వేరు చేసి ఎగుమతులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పై జమ్మలమడక కార్యాలయం లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో కృష్ణా, గోదావరి బేసిన్ లో చమురు, గ్యాస్ వనరులను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసాయి. లక్షల కోట్ల రూపాయలు ఆదాయ మార్గాలు ఉన్న వాటిని ఇక్కడ ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చకుండా కేవలం ప్రైవేట్ సంస్థలు ఆదాయాలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయనిఅర్థమవుతుంది. ప్రస్తుతం కోస్టల్ క్యారిడార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుండి ఇచ్చాపురం వరకు దాదాపు వందల కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఇప్పుడు గుర్తించబడింది అదే సముద్రపు సాండ్… అంటున్నారు. సముద్రపు ఇసుక నుండి అత్యంత విలువైన ఇటాలియన్ లాంటి ఖనిజాలు దాదాపు 8 రకాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇప్పుడు దేశంలో ఉన్న బడా కంపెనీల కన్ను వీటిపై పడిందనీ ఆంధ్రప్రదేశ్లో భీమిలి ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం లో దాదాపు 900ఎకరాలు, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం లో90 ఎకరాల్లో ఈ ఇసుక తవ్వుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తుందని, కేవలం 2000 కోట్ల రూపాయలు పెట్టుబడితో లక్షల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుకోవడానికి ఆయా ప్రవేటి కంపెనీలు పోటీపడుతున్నాయని, యాట యాభై వేలు నుండి లక్ష కోట్లు వచ్చే ఆదాయాన్ని కేవలం ప్రభుత్వం 100 నుండి 150 కోట్లకు కట్టబెట్టడానికి చూడటం  దారుణమన్నారు. ఈ ఇసుక నుండి వచ్చే ఖనిజాలకి విదేశాల్లో అత్యధిక డిమాండ్  ఉందని రాష్ట్రానికి ఆదాయం పెరగాలి అంటే గ్లోబల్ టెండర్లు పిలవాలి, అప్పుడు డిమాండ్ పెరిగి మనకు ఆదాయం పెరుగుతుందని,ఆంధ్రప్రదేశ్కు 40 శాతం పైబడి లాభాల్లో వాటా ఉండాలన్నారు. అప్పుడే రాష్ట్రం అప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుందని, గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సాండ్ విషయంలో కోర్టులో ఫీల్ వేసి ఆపించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆ ఫీల్ వేసిన వ్యక్తి తన కేసును ఉప సహకరించుకోవడం చూస్తుంటే… దీని వెనక చంద్రబాబు హస్తము ఉన్నట్లు స్పష్టమవుతుంద. కేజీ బేసిన్లో గ్యాస్ మరియు ఆయిల్ ను లక్షల క్యూబిక్మీటర్లు పట్టుకుపోతున్న గుజరాతి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే ప్రమాదాలు సంభవిస్తే వాతావరణం మార్పులు వస్తే ఆయా ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతారు. అయితే దాని వలన వచ్చే ఆదాయం మాత్రం ప్రైవేటు కంపెనీలు పట్టుకుపోవడం చాలా విచిత్రమైన విషయం. ప్రస్తుతం సముద్రపు ఇసుకను కూడా ప్రాసెస్ చేసే యూనిట్లు వల్ల ఆయా ప్రాంత ప్రజలు అత్యంత వేడిని అనుభవించి తీవ్రంగా అనారోగ్య ల పాలవుతారు కానీ ఆదాయం మాత్రం ప్రైవేట్ కంపెనీలు పట్టుకుపోతాయి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఆదాయ వనరులలో సగభాగం పైన లబ్ధి చేకూర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కానీ కేవలం కంపెనీలకు వచ్చే ఆదాయాల్లో 8 శాతానికి మాత్రమే ప్రభుత్వం పరిమితి అవడం ఆయా కంపెనీలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నాయో అర్థమవుతుందన్నారు .దీనిని రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో వనరులను దోచేసి ఆయా ప్రాంత ప్రజలకు కనీసం ఇవ్వవలసిన వాటా కూడా ఇవ్వకుండా కేవలం ఒకటి రెండు కంపెనీలు పట్టుకుపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ సముద్రపు ఇసుక విషయంలో అవగాహన పెంచుకుని అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అన్యాయాలకు పాల్పడుతుందో గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది మేధావులు సంఘసంస్కర్తలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది.

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 1,
ఏదైనా రాష్ట్రం లేక దేశం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ లభించే వనరులను సద్వినియోగం చేసుకోవాలనీ తద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అలా ఉన్న వనరులన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా ఇచ్చేస్తూ రాష్టానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయని రాష్ట్ర వై సి పి మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మలమడక నాగమణి ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా పలు ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో పలు ఖనిజాల వేరు చేసి ఎగుమతులు చేయటానికి
రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పై జమ్మలమడక కార్యాలయం లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో కృష్ణా, గోదావరి బేసిన్ లో చమురు, గ్యాస్ వనరులను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసాయి. లక్షల కోట్ల రూపాయలు ఆదాయ మార్గాలు ఉన్న వాటిని ఇక్కడ ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చకుండా కేవలం ప్రైవేట్ సంస్థలు ఆదాయాలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయనిఅర్థమవుతుంది. ప్రస్తుతం కోస్టల్ క్యారిడార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుండి ఇచ్చాపురం వరకు దాదాపు వందల కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఇప్పుడు గుర్తించబడింది అదే సముద్రపు సాండ్… అంటున్నారు. సముద్రపు ఇసుక నుండి అత్యంత విలువైన ఇటాలియన్ లాంటి ఖనిజాలు దాదాపు 8 రకాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇప్పుడు దేశంలో ఉన్న బడా కంపెనీల కన్ను వీటిపై పడిందనీ ఆంధ్రప్రదేశ్లో భీమిలి ప్రాంతంలో
శ్రీకాకుళం జిల్లా గార మండలం లో దాదాపు 900ఎకరాలు, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం లో90 ఎకరాల్లో ఈ ఇసుక తవ్వుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తుందని, కేవలం 2000 కోట్ల రూపాయలు పెట్టుబడితో లక్షల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుకోవడానికి ఆయా ప్రవేటి కంపెనీలు పోటీపడుతున్నాయని, యాట యాభై వేలు నుండి లక్ష కోట్లు వచ్చే ఆదాయాన్ని కేవలం ప్రభుత్వం 100 నుండి 150 కోట్లకు కట్టబెట్టడానికి చూడటం  దారుణమన్నారు. ఈ ఇసుక నుండి వచ్చే ఖనిజాలకి విదేశాల్లో అత్యధిక డిమాండ్  ఉందని
రాష్ట్రానికి ఆదాయం పెరగాలి అంటే గ్లోబల్ టెండర్లు పిలవాలి, అప్పుడు డిమాండ్ పెరిగి మనకు ఆదాయం పెరుగుతుందని,ఆంధ్రప్రదేశ్కు 40 శాతం పైబడి లాభాల్లో వాటా ఉండాలన్నారు. అప్పుడే రాష్ట్రం అప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుందని,
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సాండ్ విషయంలో కోర్టులో ఫీల్ వేసి ఆపించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆ ఫీల్ వేసిన వ్యక్తి తన కేసును ఉప సహకరించుకోవడం చూస్తుంటే… దీని వెనక చంద్రబాబు హస్తము ఉన్నట్లు స్పష్టమవుతుంద. కేజీ బేసిన్లో గ్యాస్ మరియు ఆయిల్ ను లక్షల క్యూబిక్మీటర్లు పట్టుకుపోతున్న గుజరాతి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే
ప్రమాదాలు సంభవిస్తే వాతావరణం మార్పులు వస్తే ఆయా ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతారు. అయితే దాని వలన వచ్చే ఆదాయం మాత్రం ప్రైవేటు కంపెనీలు పట్టుకుపోవడం చాలా విచిత్రమైన విషయం. ప్రస్తుతం సముద్రపు ఇసుకను కూడా ప్రాసెస్ చేసే యూనిట్లు వల్ల ఆయా ప్రాంత ప్రజలు అత్యంత వేడిని అనుభవించి తీవ్రంగా అనారోగ్య ల పాలవుతారు కానీ ఆదాయం మాత్రం ప్రైవేట్ కంపెనీలు పట్టుకుపోతాయి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఆదాయ వనరులలో సగభాగం పైన లబ్ధి చేకూర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కానీ కేవలం కంపెనీలకు వచ్చే ఆదాయాల్లో 8 శాతానికి మాత్రమే ప్రభుత్వం పరిమితి అవడం ఆయా కంపెనీలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నాయో అర్థమవుతుందన్నారు .దీనిని రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో వనరులను దోచేసి ఆయా ప్రాంత ప్రజలకు కనీసం ఇవ్వవలసిన వాటా కూడా ఇవ్వకుండా కేవలం ఒకటి రెండు కంపెనీలు పట్టుకుపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ సముద్రపు ఇసుక విషయంలో అవగాహన పెంచుకుని అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అన్యాయాలకు పాల్పడుతుందో గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది మేధావులు సంఘసంస్కర్తలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.