చిట్వేల్ పట్టణంలోని ప్రధాన బజారు వీధులలో వీధి శునకాల విర్రవీగింపు రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై ఎప్పుడెప్పుడు దాడి చేస్తాయోనన్న భయంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యాపార సమయాల్లో దుకాణాలకు వచ్చే కస్టమర్లు కూడా శునకాల భయంతో వెనక్కి తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల పది నెలల పసిబిడ్డపై శునకాల దాడి జరగడంతో చిన్నారి ఆసుపత్రి పాలైన ఘటన ప్రజలను మరింత భయాందోళనకు గురి చేసింది. చిన్నారి ప్రాణం బతికినా, ఈ సంఘటన పట్టణ ప్రజల్లో ఆగ్రహం రేకెత్తించింది.
“ఇక సహించలేము… పంచాయతీ శాఖ అధికారులు వెంటనే ముందడుగు వేసి శునకాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. లేకపోతే బజారు వ్యాపారాలు దెబ్బతింటాయి, ప్రజల ప్రాణాలు సురక్షితం కావు” అని స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. చివరగా చిట్వేల్ ప్రజల ఏకగ్రీవ కోరిక – పంచాయతీ శాఖ తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ శునకాల సమస్యను పరిష్కరించాలి. జనజీవనాన్ని కాపాడేందుకు, పట్టణంలో శాంతి భద్రతలు నిలుపుదలకు పంచాయతీ శాఖ ఇప్పుడే కదలిక చూపాలని పట్టణ ప్రజలు వ్యాకులంగా కోరుకుంటున్నారు.

చిట్వేల్ బజారులో శునకాల ఉన్మాదం – ప్రజల్లో భయాందోళన …..పసిబిడ్డపై దాడితో ప్రజల్లో ఆగ్రహం; తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక
చిట్వేల్ పట్టణంలోని ప్రధాన బజారు వీధులలో వీధి శునకాల విర్రవీగింపు రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై ఎప్పుడెప్పుడు దాడి చేస్తాయోనన్న భయంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యాపార సమయాల్లో దుకాణాలకు వచ్చే కస్టమర్లు కూడా శునకాల భయంతో వెనక్కి తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల పది నెలల పసిబిడ్డపై శునకాల దాడి జరగడంతో చిన్నారి ఆసుపత్రి పాలైన ఘటన ప్రజలను మరింత భయాందోళనకు గురి చేసింది. చిన్నారి ప్రాణం బతికినా, ఈ సంఘటన పట్టణ ప్రజల్లో ఆగ్రహం రేకెత్తించింది. “ఇక సహించలేము… పంచాయతీ శాఖ అధికారులు వెంటనే ముందడుగు వేసి శునకాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. లేకపోతే బజారు వ్యాపారాలు దెబ్బతింటాయి, ప్రజల ప్రాణాలు సురక్షితం కావు” అని స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. చివరగా చిట్వేల్ ప్రజల ఏకగ్రీవ కోరిక – పంచాయతీ శాఖ తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ శునకాల సమస్యను పరిష్కరించాలి. జనజీవనాన్ని కాపాడేందుకు, పట్టణంలో శాంతి భద్రతలు నిలుపుదలకు పంచాయతీ శాఖ ఇప్పుడే కదలిక చూపాలని పట్టణ ప్రజలు వ్యాకులంగా కోరుకుంటున్నారు.

