నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ):
వీఆర్ హైస్కూల్పై వైసీపీ నేతలు చేసే విమర్శలను పట్టించుకోనని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నిరుపేదలకు మంచి చేయడం వారికి ఇష్టం లేదన్నారు. తన మీద విమర్శలు చేయలేక వీఆర్ హైస్కూల్పై చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హుందాగా వ్యవహరించాలని, లేదంటే 11 సీట్లు కాస్త జీరోకి పడిపోతాయని ఎద్దేవా చేశారు.

