హైదరాబాద్‌లోని మాన్‌ఫోర్ట్ సోషల్ జస్టిస్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు, సెంట్రల్ విజిలెన్స్ కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టిఐ ఆక్టివిస్టు ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి ట్రేనర్ ఆశ్రఫ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం-1989 మరియు సమాచార హక్కు చట్టం-2005 అమలుపై సమగ్రంగా తెలిపారు. చట్టాల ప్రధాన లక్ష్యాలు, ప్రజలకు కల్పించిన హక్కులు, బాధ్యతలు, రక్షణ చర్యలను వివరించారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగే వివక్ష, దాడులు, అన్యాయాలను అరికట్టేందుకు చట్టంలో ఉన్న నిబంధనలను వివరించారు. బాధితులకు అందే న్యాయ సహాయం, పరిహారం, పునరావాస చర్యలపై అవగాహన కల్పించారు. జిల్లా విజిలెన్స్ కమిటీల పాత్ర, బాధ్యతలు, పర్యవేక్షణ విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
సమాచార హక్కు చట్టం-2005 ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఎలా పెరుగుతుందో వివరించారు. ప్రజలు సమాచార హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని పొందే విధానాన్ని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సమాచార హక్కు చట్టం కీలక సాధనమని పేర్కొన్నారు. సభ్యులు చట్టాల అమలులో ఎదురయ్యే సవాళ్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పలు అంశాలపై ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించి సందేహాలను నివృత్తి చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన పెరగడం ద్వారా సమాజంలో న్యాయం, పారదర్శకత మరింత బలోపేతం అవుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఆర్టీఐ చట్టం పై అవగాహన సదస్సు
హైదరాబాద్‌లోని మాన్‌ఫోర్ట్ సోషల్ జస్టిస్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు, సెంట్రల్ విజిలెన్స్ కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టిఐ ఆక్టివిస్టు ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి ట్రేనర్ ఆశ్రఫ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం-1989 మరియు సమాచార హక్కు చట్టం-2005 అమలుపై సమగ్రంగా తెలిపారు. చట్టాల ప్రధాన లక్ష్యాలు, ప్రజలకు కల్పించిన హక్కులు, బాధ్యతలు, రక్షణ చర్యలను వివరించారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగే వివక్ష, దాడులు, అన్యాయాలను అరికట్టేందుకు చట్టంలో ఉన్న నిబంధనలను వివరించారు. బాధితులకు అందే న్యాయ సహాయం, పరిహారం, పునరావాస చర్యలపై అవగాహన కల్పించారు. జిల్లా విజిలెన్స్ కమిటీల పాత్ర, బాధ్యతలు, పర్యవేక్షణ విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సమాచార హక్కు చట్టం-2005 ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఎలా పెరుగుతుందో వివరించారు. ప్రజలు సమాచార హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని పొందే విధానాన్ని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సమాచార హక్కు చట్టం కీలక సాధనమని పేర్కొన్నారు. సభ్యులు చట్టాల అమలులో ఎదురయ్యే సవాళ్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పలు అంశాలపై ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించి సందేహాలను నివృత్తి చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన పెరగడం ద్వారా సమాజంలో న్యాయం, పారదర్శకత మరింత బలోపేతం అవుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.

