మల్లయ్య గూడెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
పున్నమి ప్రతినిధి జూన్ 25
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మల్లాయగూడెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా వరినారు మడిలో మరియు వెదజల్లిన వరి విధానంలో సస్యరక్షణ చర్యలు గురించి క్లుప్తంగా రైతులకి సూచనలు ఇవ్వడం జరిగింది. వారి నారు బడిలో వచ్చే తెగులు గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించే విధానంలో భాగంగా అందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రస్తుతం నారిమడిలో ముందస్తుగా నివారణ చర్యలు పచ్చ పురుగు నివారణకు నిమాస్త్రం తయారుచేసి రైతుల సమక్షంలో డెమో చూపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే రైతు సంక్షేమ పథకాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లయ్య గూడెం గ్రామ సర్పంచ్ చీకటి కవిత రమేష్ చింతలపూడి మండల వ్యవసాయ అధికారి కోటగిరి మురళీకృష్ణ మరియు డిఎంఎంటి వర్మ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది

