Thursday, 13 August 2026
  • Home  
  • 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలలో బహుమతులు ప్రధానం
- తిరుపతి

72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలలో బహుమతులు ప్రధానం

తిరుపతి ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర నాట్య కళాపరిషత్,తిరుపతి వారి 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాల లో మహతి ఆడిటోరియంలో సాంఘిక, పౌరాణిక పద్య నాటక గరుడ అవార్డ్ పోటీలలో భాగంగా ప్రకటించిన తుది పలితాలలో శ్రీ రామన్ ఫౌండేషన్, విజయవాడ వారి సాయిబాబా నాట్య మండలి వారి పద్య నాటకం “ఖడ్గ తిక్కన” ఉత్తమ హాస్యనటుడు, స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నది. పద్య నాటిక విభాగం లో రామన్ ఫౌండేషన్ వారి “కృష్ణవేణి మాత” నాటిక ద్వితీయ ఉత్తమ బహుమతిని, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం గాను డా. పి. వి. యన్.కృష్ణ గెలుపొందారు. కృష్ణవేణి మాత నాటకం లో నటించిన యమధర్మరాజు గా నటించిన సాయి శంకర్ ప్రోత్సాహక బహుమతిని, ఉత్తమ రంగాలంకరణ గాను శ్రీకాంత్ అవార్డులు గెలుచు కొన్నారు. అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో భాను ప్రకాష్ రెడ్డి, సుగుణమ్మ, రవి, కొత్తపల్లి మునిరత్నం, చిన్నంగారి రమణ, గుండాల గోపినాథ్ చేతుల మీదుగా అవార్డులు అందుకొన్నారు. యువ కళాకారుడు సాయిశంకర్ ను , దర్శకత్వం వహించిన డా.పివియన్ కృష్ణ ని, ఇవటూరి ప్రసాద్ ని , కుమారి కుసుమకుమారిలను జియస్ ఫొండేషన్ అధ్యక్షులు డా.జి.యస్.ప్రసాద్ సత్కరించి అభినందనలు తెలిపారు.

తిరుపతి ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర నాట్య కళాపరిషత్,తిరుపతి వారి 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాల లో మహతి ఆడిటోరియంలో సాంఘిక, పౌరాణిక పద్య నాటక గరుడ అవార్డ్ పోటీలలో భాగంగా ప్రకటించిన తుది పలితాలలో శ్రీ రామన్ ఫౌండేషన్, విజయవాడ వారి సాయిబాబా నాట్య మండలి వారి పద్య నాటకం “ఖడ్గ తిక్కన” ఉత్తమ హాస్యనటుడు, స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నది. పద్య నాటిక విభాగం లో రామన్ ఫౌండేషన్ వారి “కృష్ణవేణి మాత” నాటిక ద్వితీయ ఉత్తమ బహుమతిని, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం గాను డా. పి. వి. యన్.కృష్ణ గెలుపొందారు. కృష్ణవేణి మాత నాటకం లో నటించిన యమధర్మరాజు గా నటించిన సాయి శంకర్ ప్రోత్సాహక బహుమతిని, ఉత్తమ రంగాలంకరణ గాను శ్రీకాంత్ అవార్డులు గెలుచు కొన్నారు. అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో భాను ప్రకాష్ రెడ్డి, సుగుణమ్మ, రవి, కొత్తపల్లి మునిరత్నం, చిన్నంగారి రమణ, గుండాల గోపినాథ్ చేతుల మీదుగా అవార్డులు అందుకొన్నారు. యువ కళాకారుడు సాయిశంకర్ ను , దర్శకత్వం వహించిన డా.పివియన్ కృష్ణ ని, ఇవటూరి ప్రసాద్ ని , కుమారి కుసుమకుమారిలను జియస్ ఫొండేషన్ అధ్యక్షులు డా.జి.యస్.ప్రసాద్ సత్కరించి అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.