Sunday, 13 September 2026
  • Home  
  • 650 రోజులుగా ‘అన్న క్యాంటీన్’.. ఆకలి తీర్చుతున్న బాలయ్య వీరాభిమాని. ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్
- ఖమ్మం

650 రోజులుగా ‘అన్న క్యాంటీన్’.. ఆకలి తీర్చుతున్న బాలయ్య వీరాభిమాని. ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాన్ని ఆచరణలో చూపిస్తున్నారు ఖమ్మం నగరానికి చెందిన నల్లమల్ల రంజిత్. నటుడు బాలకృష్ణకు వీరాభిమాని అయిన రంజిత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లను ఆదర్శంగా తీసుకుని ఖమ్మం కాల్వొడ్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలకు ఉచితంగా ఒకపూట భోజనం అందిస్తున్నారు. దాతల సహకారంతో ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమాన్ని ఎలాంటి విరామం లేకుండా 650 రోజులుగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ అన్నదానం చేస్తూ పేదలు, కార్మికులు, అవసరమైన వారికి ఆకలి తీర్చడమే లక్ష్యంగా రంజిత్ సేవలందిస్తున్నారు. వ్యక్తిగత అభిమానాన్ని సామాజిక సేవగా మలిచి నిరుపేదలకు అండగా నిలుస్తున్న రంజిత్‌ను స్థానికులు అభినందిస్తున్నారు. దాతల సహకారంతో కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆకలితో వచ్చిన వారికి ఆప్యాయంగా భోజనం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్న రంజిత్ సేవలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.