Wednesday, 22 April 2026
  • Home  
  • కూటమి హామీలు ఫెయిల్ – సిపిఐ(యం.యల్) లిబరేషన్ విమర్శలు
- ఆంధ్రప్రదేశ్

కూటమి హామీలు ఫెయిల్ – సిపిఐ(యం.యల్) లిబరేషన్ విమర్శలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సిపిఐ(యం.యల్) లిబరేషన్ పార్టీ నాయకులు టి.అప్పలస్వామి విమర్శించారు. పార్టీ 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ధనాల అప్పారావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందన్నారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజలు ఉద్యమాలకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.