రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి )
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మండల బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీవో లచ్చాలు
కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, ముస్తాబాద్ మాజీ సర్పంచ్ నల్ల నరసయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

420 హామీలు 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి ) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మండల బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీవో లచ్చాలు కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, ముస్తాబాద్ మాజీ సర్పంచ్ నల్ల నరసయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

