నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ‘40 డేస్ గో టు విలేజ్’ కార్యక్రమం సందర్భంగా టౌన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ, మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. యువత ఉన్నత విద్యపై దృష్టి సారించి ఎస్సీ వర్గీకరణ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు విజయ్ మాదిగను టౌన్ ఇన్చార్జిగా, పలువురిని కో-ఇన్చార్జులుగా నియమించారు. కార్యక్రమంలో నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

40 డేస్ గో టు విలేజ్’తో ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని గ్రామాల్లో మరింత బలోపేతం చేద్దాం: పందిటి అంబేద్కర్ మాదిగ