కొండాపురం మండలం తూర్పు జంగాలపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ పర్యవేక్షణలో కలిగిరి సిఐ ఆధ్వర్యంలో కలిగిరి సర్కిల్ పోలీసు సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ జరిగింది. సదరు కార్డెన్ అండ్ సెర్చ్ లో 30 టూ వీలర్స్ రెండు ఆటోలు పత్రాలను తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగింది. అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. శాంతిభద్రతల కోసం ఇలాంటి సెర్చ్ లు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. సదరు కార్డెన్ అండ్ సెర్చ్ డ్యూటీలో కలిగిరి సిఐ పి.సుబ్బారావు ,కొండాపురం ఎస్ఐ కె.శ్రీనివాస రావు వింజమూరు ఎస్సై మరియు కలిగిరి ఎస్సై మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.





