బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి)
రామవరం: ఈ నెల 24న అన్ని ఆటో యూనియన్ సంఘాల మద్దతుతో నిర్వహించనున్న ఆటో బంద్‌ను జయప్రదం చేయాలని రామవరం ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ పిలుపునిచ్చారు. బంద్ ప్రచారంలో భాగంగా శనివారం రామవరం ఆటో స్టాండ్‌లో ఆటోలకు బంద్‌కు సంబంధించిన స్టిక్కర్లు వేసి ప్రచారం నిర్వహించారు. ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు బంద్ ఉద్దేశాలను వివరించారు. బంద్‌కు సంబంధించిన అంశాలను ప్రజలకు, ఆటో కార్మికులకు తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఎస్కే అజీమ్, దీపక్, కనకరాజు, హబీబ్, శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ఆటో డ్రైవర్లు, కార్మికులు సహకరించాలని ఎస్కే జలీల్ కోరారు. 24న ఆటోలను నిలిపివేసి బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.



