⛔శ్రీధనమల్లి హైస్కూల్లో అపరశుభ్రత.
⛔హై స్కూల్ ప్రాంగణంలో పేడ దిబ్బలు, డ్రైనేజీ నీళ్లు.
⛔శ్రీధనమల్లి పంచాయతీలో స్వచ్ఛభారత్ ఎక్కడ??
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం శ్రీధనమల్లి పంచాయతీలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంచుట్టూ పేడ దిబ్బలు వేస్తున్న పంచాయతీ కార్యదర్శి స్పందించకపోవడం లేదు. రాష్ట్రమంతా చెత్త పై సమరం చేస్తుంటే శ్రీధనమల్లి పంచాయతీలో మాత్రం ఆ ఆనవాళ్లే కనబడడం లేదు. గృహాలలో వాడుకున్న మురికి నీళ్లు స్కూలు ప్రాంగణంలోకి వదులుతున్న హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కానీ, పంచాయతీ కార్యదర్శి గాని స్పందించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి స్కూలు ప్రాంగణంలో ఉన్న పేడ దిబ్బలను తీపించాలని పిల్లల తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

