డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, పి.గన్నవరం మండలంలోని వాడ్రేవుపల్లి నుంచి చాకలిపాలెం వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గుంతలు, దెబ్బతిన్న రహదారితో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రహదారి ఇదే పరిస్థితికి చేరుకుంటోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. రహదారి దుస్థితిపై ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే స్పందించి, నాణ్యతా ప్రమాణాలతో శాశ్వతంగా రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



