Monday, 28 September 2026
  • Home  
  • పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్‌లో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు
- ఖమ్మం

పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్‌లో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు

ఖమ్మం: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్‌లో పోలీస్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. ముందుగా గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానంలో పాల్గొని పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. పోలీస్ కుటుంబాలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా సిబ్బందిలో ఆత్మీయత, కుటుంబ భావన మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర పది రోజులుగా గణేష్ నవరాత్రుల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఎస్పీ రామానుజం, అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, విజయబాబు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్బీ ఏసీపీ మహేష్, సర్వర్, శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, అప్పలనాయుడు, సాంబశివరావు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్‌లో పోలీస్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. ముందుగా గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానంలో పాల్గొని పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. పోలీస్ కుటుంబాలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా సిబ్బందిలో ఆత్మీయత, కుటుంబ భావన మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు.

పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర

పది రోజులుగా గణేష్ నవరాత్రుల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఎస్పీ రామానుజం, అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, విజయబాబు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్బీ ఏసీపీ మహేష్, సర్వర్, శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, అప్పలనాయుడు, సాంబశివరావు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.