Monday, 28 September 2026
  • Home  
  • బిజెపి ఆధ్వర్యంలో ఖమ్మంలో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రారంభం
- ఖమ్మం

బిజెపి ఆధ్వర్యంలో ఖమ్మంలో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రారంభం

ఖమ్మం నగరం: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం 45, 49 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గెంటేల విద్యాసాగర్ఆ,వేల్పుల సుధాకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఓటరు నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. నమోదు చేసుకునే వారు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా సర్టిఫికెట్ జిరాక్స్, ఓటరు ఐడీ నంబర్, ఇంటి చిరునామా, మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు అందించాలని సూచించారు. మరిన్ని వివరాలకు వేల్పుల సుధాకర్ (9885555811), ఈశ్వరప్రగడ లలిత (7095339911), ఈశ్వరప్రగడ రామారావు (9010460916), పెగళ్లపాటి నటరాజ్ (9885999934)లను సంప్రదించాలని కోరారు. పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నమోదు ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం నగరం: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం 45, 49 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గెంటేల విద్యాసాగర్ఆ,వేల్పుల సుధాకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఓటరు నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. నమోదు చేసుకునే వారు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా సర్టిఫికెట్ జిరాక్స్, ఓటరు ఐడీ నంబర్, ఇంటి చిరునామా, మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు అందించాలని సూచించారు.
మరిన్ని వివరాలకు వేల్పుల సుధాకర్ (9885555811), ఈశ్వరప్రగడ లలిత (7095339911), ఈశ్వరప్రగడ రామారావు (9010460916), పెగళ్లపాటి నటరాజ్ (9885999934)లను సంప్రదించాలని కోరారు. పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నమోదు ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.