Monday, 28 September 2026
  • Home  
  • బంగాళాఖాతంలో మరో వాయుగుండం…ఏపీకి వర్ష సూచన
- ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో మరో వాయుగుండం…ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. మయన్మార్‌-అండమాన్‌ మధ్య ఇది ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ప్రస్తుతం అండమాన్‌లోని మాయాబందర్‌కి 580 కి.మీ దూరంలో తూర్పు ఈశాన్యంగా కేంద్రీకృతమై ఉత్తర వాయవ్యంగా బంగ్లాదేశ్‌ వైపు పయనిస్తోంది. 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం-బంగ్లాదేశ్‌ మధ్య ఇది తీరం దాటే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఇటీవలే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడి కళింగపట్నం వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే. దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.