Monday, 28 September 2026
  • Home  
  • భగత్ సింగ్ స్పూర్తితో డేటా సెంటర్ల రద్దుకు పోరాటం గ్రీన్ విశాఖ ప్రతినిధులు
- విశాఖపట్నం

భగత్ సింగ్ స్పూర్తితో డేటా సెంటర్ల రద్దుకు పోరాటం గ్రీన్ విశాఖ ప్రతినిధులు

సహజ వనరులు, ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టి, పర్యావరణాన్ని నాశనం చేసే విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వ చర్యలను భగత్ సింగ్ స్పూర్తితో పోరాడి తిప్పికొడతామని గ్రీన్ విశాఖ కోశాధికారి జి కాంతారావు అన్నారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా సోమవారం ఆర్ కె బీచ్ లోని ఆయన విగ్రహానికి గ్రీన్ విశాఖ ఉపాధక్ష్యులు డాక్టర్ రఘు, హెచ్ ఆర్ ఎఫ్ నాయకులు అనురాధ పూలమాల వేశారు. పర్యావరణ, తాగునీటి సమస్యలు పెంచే డేటా సెంటర్ల అనుమతులు రద్దు చేసే వరకు పోరాడుతామని కాంతారావు తెలిపారు. అభివృద్ధి పేరుతో విశాఖలో జరుగుతున్న విధ్వంసం నిలువరించడానికి ప్రజలందరూ కలిసి పోరాడాలని అన్నారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ విశాఖ ప్రతినిధులు కె తిరుపతిరావు, హెచ్ ఆర్ ఎఫ్ నాయకులు సుధ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.