అధికారులకు పిలుపు నిచ్చిన జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్*
విశాఖపట్నం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వంపై సూచనలు చేశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవలు అందించడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, మరింత మంది సభ్యులు చేరేలా అవగాహన కల్పించి సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


