ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో సెప్టెంబరు 29న నిర్వహించనున్న ‘పల్లె పండుగ 3.0’ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొనే ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ కూటమి శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. ఇటీవల యువనేత నారా లోకేష్ పర్యటనను ఏకతాటిపై నిలిచి విజయవంతం చేసిన స్ఫూర్తితో పల్లె పండుగ 3.0ను కూడా దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. పల్లెల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

రామాపురంలో ‘పల్లె పండుగ 3.0’ను విజయవంతం చేద్దాం