Monday, 28 September 2026
  • Home  
  • ప్రజావాణిలో దరఖాస్తుకే నో.. అధికారిపై ఆర్టీఐ కార్యకర్తల ఆగ్రహం
- ASIFABAD

ప్రజావాణిలో దరఖాస్తుకే నో.. అధికారిపై ఆర్టీఐ కార్యకర్తల ఆగ్రహం

బెజ్జూర్, సెప్టెంబర్ 28 (పున్నమి): ప్రజల సమస్యలు, ఫిర్యాదులు, వినతులను స్వీకరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు స్వీకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం బెజ్జూర్ రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో కౌటాల మండలం తాటినగర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త దుర్గం శరత్ చంద్ర దరఖాస్తు సమర్పించేందుకు వెళ్లగా, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ దాన్ని స్వీకరించలేదని ఆర్టీఐ కార్యకర్తలు ఆరోపించారు. ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరారు. దరఖాస్తును ఎందుకు స్వీకరించలేదో, ఏ నిబంధనల ప్రకారం తిరస్కరించారో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్తలు కోరారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

బెజ్జూర్, సెప్టెంబర్ 28 (పున్నమి): ప్రజల సమస్యలు, ఫిర్యాదులు, వినతులను స్వీకరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు స్వీకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం బెజ్జూర్ రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో కౌటాల మండలం తాటినగర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త దుర్గం శరత్ చంద్ర దరఖాస్తు సమర్పించేందుకు వెళ్లగా, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ దాన్ని స్వీకరించలేదని ఆర్టీఐ కార్యకర్తలు ఆరోపించారు.

ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరారు. దరఖాస్తును ఎందుకు స్వీకరించలేదో, ఏ నిబంధనల ప్రకారం తిరస్కరించారో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్తలు కోరారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.