Wednesday, 23 September 2026
  • Home  
  • పింఛన్ పంపిణీలో కీలక మార్పులు.. బ్యాంకులో కొంత, చేతికి కొంత!
- అనకాపల్లి

పింఛన్ పంపిణీలో కీలక మార్పులు.. బ్యాంకులో కొంత, చేతికి కొంత!

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ వాటా (NSAP)ను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా (ఎన్‌టీఆర్ భరోసా)ను గతంలో మాదిరిగానే ఇంటివద్ద నగదు రూపంలో అందించనున్నారు. 60–79 ఏళ్ల వృద్ధులకు రూ.200 బ్యాంకులో, రూ.3,800 చేతికి కలిపి రూ.4,000 అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.500 బ్యాంకులో, రూ.3,500 చేతికి వస్తుంది. 40–79 ఏళ్ల వితంతువులకు రూ.300 బ్యాంకులో, రూ.3,700 చేతికి అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వితంతువులకు రూ.500 బ్యాంకులో, రూ.3,500 చేతికి అందుతుంది. వికలాంగులకు మొత్తం రూ.6,000లో రూ.300 లేదా రూ.500 బ్యాంకులో, మిగిలిన మొత్తం నగదుగా అందుతుంది. పింఛన్ మొత్తం తగ్గదని, పంపిణీ విధానంలో మాత్రమే మార్పు జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాను పరిశీలించుకోవాలని, నగదు జమ కాకపోతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి బ్యూరో)

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ వాటా (NSAP)ను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా (ఎన్‌టీఆర్ భరోసా)ను గతంలో మాదిరిగానే ఇంటివద్ద నగదు రూపంలో అందించనున్నారు.
60–79 ఏళ్ల వృద్ధులకు రూ.200 బ్యాంకులో, రూ.3,800 చేతికి కలిపి రూ.4,000 అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.500 బ్యాంకులో, రూ.3,500 చేతికి వస్తుంది. 40–79 ఏళ్ల వితంతువులకు రూ.300 బ్యాంకులో, రూ.3,700 చేతికి అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వితంతువులకు రూ.500 బ్యాంకులో, రూ.3,500 చేతికి అందుతుంది. వికలాంగులకు మొత్తం రూ.6,000లో రూ.300 లేదా రూ.500 బ్యాంకులో, మిగిలిన మొత్తం నగదుగా అందుతుంది.
పింఛన్ మొత్తం తగ్గదని, పంపిణీ విధానంలో మాత్రమే మార్పు జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాను పరిశీలించుకోవాలని, నగదు జమ కాకపోతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.