*సూళ్లూరుపేట:* పేదల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రతి ఒక్కరికీ మర్యాద అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ అన్నారు. పీఎంఏవై పథకం ద్వారా ‘మన ఇల్లు-మన గౌరవం’ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారుపోలూరు వద్ద సుమారు రూ.131 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన టిడ్కో గృహాలను గురువారం ఎమ్మెల్యే నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 185 మంది లబ్ధిదారులకు గతంలో వారు చెల్లించిన వాటాలను ప్రభుత్వం తిరిగి చెల్లించే నిర్ణయంలో భాగంగా రూ.56.61 లక్షల విలువైన నమూనా చెక్కును పంపిణీ చేశారు. సకల హక్కుల వసతులతో నిర్మించిన ఈ గృహ సముదాయాన్ని లబ్ధిదారులకు అప్పగించడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. గత 20-25 ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివసించిన పేద కుటుంబాలు నేడు సొంతింటి యజమానులుగా మారడం ఆనందంగా ఉందని లబ్ధిదారులు పేర్కొంటూ ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నేలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరసా రత్నం, సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయ అధ్యక్షుడు కమిటీ చైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏపీఎన్ఎస్ చైర్మన్ ఆకుతోట రమేష్, పురపాలక కమిషనర్, టిడ్కో ఈఈ, ఏఈలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


