అనంతసాగరం సెప్టెంబర్ 25,పున్నమి ప్రతినిధి :
అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి శుక్రవారం ఉదయానికి 10,504 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.. గత రెండు మూడు రోజుల నుంచి పై తట్టు ప్రాంతాలలో వర్షాలు పడుతుండటంతో సోమశిల జలాశయానికి గురువారం 6600 క్యూసెక్కుల వరద వచ్చి చేరగా శుక్రవారం ఉదయానికి 10500 క్యూసెక్కుల వరద నమోదయింది. ప్రస్తుతం జలాశయం 17 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం జలాశయానికి 10500 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా, జలాశయం నుండి దిగువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 17 టిఎంసి నీరు నిల్వ ఉంది..


