శ్రీ కాళహస్తి, జులై 03 : (పున్నమి న్యూస్) : జనసేన పార్టీ నిర్మాణంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ తిరుపతి పార్లమెంట్ పరిశీలకురాలిగా లోకం మాధవిని నియమించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ ఆమెను కలిసి, పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణకు సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిర్ణయాలకు తామంతా పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణం, బలోపేతం కోసం ఎల్లప్పుడూ ముందుండి సహకరిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం కావడం కోసం ప్రతి జనసైనికుడు, వీర మహిళ, కార్యకర్త పరస్పర సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అధిష్ఠాన నిర్ణయాలకు తామంతా పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంటాం…. కొట్టే సాయి