నంద్యాల జిల్లా ప్రజా పరిషత్ (ZPP) నూతన కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి జి. రాజకుమారి ప్రారంభించారు. మండల్ రిసోర్స్ సెంటర్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ద్వారా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తామన్నారు. ఈ నూతన జెడ్పీ పరిపాలన కోసం ఉమ్మడి జిల్లా నుంచి 45 మంది ఉద్యోగులను కేటాయించామని, త్వరలోనే సీఈఓ, డిప్యూటీ సీఈఓల నియామకం పూర్తవుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, ఆర్డీఓ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభం.. శ్రీకారం చుట్టిన కలెక్టర్ రాజకుమారి