Saturday, 4 July 2026
  • Home  
  • టీడీపీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం.. శిక్షణలో పాల్గొన్న ఆత్మకూరు ప్రతినిధులు
- News - అమరావతి - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం.. శిక్షణలో పాల్గొన్న ఆత్మకూరు ప్రతినిధులు

ఆత్మకూరు, జూలై 4 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆత్మకూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి గారి ఆధ్వర్యంలో, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి గారి సూచనలతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మండల యూనిట్ కన్వీనర్ల శిక్షణా కార్యక్రమానికి ఆత్మకూరు రూరల్ మండల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలతో నిరంతర అనుసంధానం పెంపొందించడం లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యూనిట్ కన్వీనర్ల పాత్ర, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రజా సమస్యలపై వేగవంతమైన స్పందన, సోషల్ మీడియా వినియోగం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై నాయకులకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రూరల్ యూనిట్ కన్వీనర్లు కొండ్రెడ్డి రమణారెడ్డి, షేక్ హుస్సేన్, కొప్పోలు విజయభాస్కర్ రెడ్డి పాల్గొని శిక్షణ పొందారు. శిక్షణలో పార్టీ నాయకత్వం ఇచ్చిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసి గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని వారు నిర్ణయించారు.అలాగే ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులతో సమన్వయం పెంచుకోవడం, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని, గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీపై మరింత విశ్వాసం పెంచే విధంగా సేవలందించాలని శిక్షణా కార్యక్రమంలో నాయకులు పిలుపునిచ్చారు.

ఆత్మకూరు, జూలై 4 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆత్మకూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి గారి ఆధ్వర్యంలో, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి గారి సూచనలతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మండల యూనిట్ కన్వీనర్ల శిక్షణా కార్యక్రమానికి ఆత్మకూరు రూరల్ మండల ప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలతో నిరంతర అనుసంధానం పెంపొందించడం లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యూనిట్ కన్వీనర్ల పాత్ర, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రజా సమస్యలపై వేగవంతమైన స్పందన, సోషల్ మీడియా వినియోగం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై నాయకులకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రూరల్ యూనిట్ కన్వీనర్లు కొండ్రెడ్డి రమణారెడ్డి, షేక్ హుస్సేన్, కొప్పోలు విజయభాస్కర్ రెడ్డి పాల్గొని శిక్షణ పొందారు. శిక్షణలో పార్టీ నాయకత్వం ఇచ్చిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసి గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని వారు నిర్ణయించారు.అలాగే ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులతో సమన్వయం పెంచుకోవడం, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని, గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీపై మరింత విశ్వాసం పెంచే విధంగా సేవలందించాలని శిక్షణా కార్యక్రమంలో నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.