Wednesday, 23 September 2026
  • Home  
  • రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- అనకాపల్లి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పురుషోత్తపురంలో రూ.24 లక్షలతో రైతు భరోసా సేవా కేంద్రం ప్రారంభం పున్నమి ప్రతినిధి (అనకాపల్లి బ్యూరో) రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఏపీ ఆర్‌డీసీ చైర్మన్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.24 లక్షలతో నిర్మించిన రైతు భరోసా సేవా కేంద్రం భవనాన్ని మంగళవారం వారు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి భవనాన్ని పరిశీలించిన అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ సలహాలు ఒకే చోట అందించేందుకు రైతు భరోసా సేవా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయిలోనే వ్యవసాయ సేవలు అందుబాటులోకి రావడంతో రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలమంచిలి రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు ఇత్తంశెట్టి సన్యాసి నాయుడు, యలమంచిలి టౌన్ జనసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎంపీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పురుషోత్తపురంలో రూ.24 లక్షలతో రైతు భరోసా సేవా కేంద్రం ప్రారంభం

పున్నమి ప్రతినిధి (అనకాపల్లి బ్యూరో)

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఏపీ ఆర్‌డీసీ చైర్మన్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.24 లక్షలతో నిర్మించిన రైతు భరోసా సేవా కేంద్రం భవనాన్ని మంగళవారం వారు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి భవనాన్ని పరిశీలించిన అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ సలహాలు ఒకే చోట అందించేందుకు రైతు భరోసా సేవా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయిలోనే వ్యవసాయ సేవలు అందుబాటులోకి రావడంతో రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎలమంచిలి రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు ఇత్తంశెట్టి సన్యాసి నాయుడు, యలమంచిలి టౌన్ జనసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎంపీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.