అనంతగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తడబారికి మితుల అధ్యక్షతన మండల పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాల్గొన్నారు. మండల అభివృద్ధికి సహకరించిన అధికారులకు ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లలో అనంతగిరికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర తెలిపారు. 2021-26 పదవీకాల ఎంపీటీసీ సభ్యుల సేవలను గుర్తిస్తూ ఘనంగా శాలువాలతో సత్కరించారు. జడ్పీటీసీ గంగరాజు, ఎంపీడీవో ప్రభాకర్, ఎంఆర్ఓ వీరభద్రచారి, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

అనంతగిరిలో ఎంపీటీసీ సభ్యులకు సన్మానం