Friday, 3 July 2026
  • Home  
  • ఆత్మకూరులో ఉద్రిక్తత స్మశాన వాటిక ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో ఉద్రిక్తత స్మశాన వాటిక ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన!

కరటంపాడులో దొంగ పట్టాలతో హిందూ స్మశాన వాటిక ఆక్రమణ. సచివాలయం వద్ద గ్రామస్తుల ధర్నా. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు డిమాండ్.ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో రాజేంద్ర నాయుడు అతని అనుచరులు పట్టాలు సృష్టించుకుని హిందూ స్మశాన వాటికను ఆక్రమించుకుంటున్నారంటూ కరటంపాడు సచివాలయం వద్ద పలువురు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరటంపాడు గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన సుమారు 500 కుటుంబాల వారు ఎవరైనా మరణిస్తే మూడు తరాలుగా ఉన్న స్మశాన వాటికలోనే ఖననం చేస్తూ వస్తున్నామని అయితే గ్రామంలోని రాజేంద్ర నాయుడు అతని అనుచరులు ఆ స్మశాన వాటికకు దొంగ పట్టాలు సృష్టించుకుని ఆ ప్రాంతాన్ని చదును చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై పలుమార్లు తహసిల్దార్, జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశామని అయినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జెసిబి తో చదును చేస్తుండగా శవాల పుర్రెలు ఎముకలు కూడా బయటపడ్డాయని స్థానికులు చూపిస్తున్నారు. 500 కుటుంబాలకు చెందిన స్మశాన వాటికను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్మశాన వాటికను ఆక్రమించిన అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని మా స్మశాన వాటికను మాకు ఇప్పించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.