ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 21 ( పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్, వకీల్పేట, రాజావీధిలో ఏర్పాటు చేసిన గణనాధుని మండపాల వద్ద సోమవారం ఏడవ రోజు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజలు, కుంకుమార్చన తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయదాతలుగా అడపాల హరి రూపిణి, నవకోటి మజందర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి.

మనుబోలులో వైభవంగా గణనాధునికి ఏడవ రోజు ప్రత్యేక పూజలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 21 ( పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్, వకీల్పేట, రాజావీధిలో ఏర్పాటు చేసిన గణనాధుని మండపాల వద్ద సోమవారం ఏడవ రోజు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజలు, కుంకుమార్చన తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయదాతలుగా అడపాల హరి రూపిణి, నవకోటి మజందర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి.

