Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ASIలకు సీపీ సునీల్ దత్ అభినందనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ASIలకు సీపీ సునీల్ దత్ అభినందనలు

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ (ASI)లుగా ఉద్యోగోన్నతి పొందిన 11 మంది పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. కమిషనరేట్ కార్యాలయంలో SD జలీల్, J రవి, SK ఖాసిం అలీ, K వెంకటేశ్వర రావు, K చెన్నారావు, S శ్రీనివాసరావు, B పిచ్చయ్య, G హరి, S వెంకట కోటిరెడ్డి, R కాళహస్తి, B పెద రాజేందర్లకు ఉన్నతి చిహ్నాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగోన్నతి పొందిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు. కార్యక్రమంలో అదనపు DCP బొజ్జ రామానుజం, సంఘం అధ్యక్షుడు హేమనాద్ పాల్గొన్నారు.

ASIలకు సీపీ సునీల్ దత్ అభినందనలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *