పల్నాడు: *నరసరావుపేట జెడ్పీ కార్యాలయం ప్రారంభం* సెప్టెంబర్ 26: జిల్లా ప్రజా పరిషత్ నిధులతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకువెళ్తామని జిల్లా కలెక్టర్, జెడ్పీ ప్రత్యేక అధికారి కృతిక శుక్ల ప్రకటించారు.నూతన జిల్లాలకు జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటు కాగా, పల్నాడు జిల్లా లోనూ జిల్లా ప్రజా పరిషత్ శుక్రవారం ఏర్పాటైంది. నూతనంగా ఏర్పాటైన పల్నాడు జిల్లా ప్రజా పరిషత్ కు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాగానే స్థానిక ఎండిఓ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా పరిషత్ నూతన జిల్లా కార్యాలయాన జెడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


