వార్త ముఖ్యాంశాలు
- 5 ఏళ్లు పైబడిన చిన్నారులను హెల్త్ కార్డుల్లో చేర్చాలని డిమాండ్ ఆత్మకూరు, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): 5 సంవత్సరాలు పైబడిన పిల్లల పేర్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల్లో చేర్చుకునే అవకాశం కల్పించాలని కోరుతూ ఆత్మకూరు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ ఆరోగ్యశాఖ మంత్రి,…
- వీరపాండియన్, ఐఏఎస్, అలాగే ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓలకు వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు.
- పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు మెరుగైన వైద్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, వారి సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపడతామని అశోక్ తెలిపారు.
5 ఏళ్లు పైబడిన చిన్నారులను హెల్త్ కార్డుల్లో చేర్చాలని డిమాండ్
ఆత్మకూరు, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): 5 సంవత్సరాలు పైబడిన పిల్లల పేర్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల్లో చేర్చుకునే అవకాశం కల్పించాలని కోరుతూ ఆత్మకూరు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ ఆరోగ్యశాఖ మంత్రి, ఇద్దరు ఉన్నతాధికారులకు స్పీడ్ పోస్ట్ ద్వారా వినతిపత్రాలు పంపించారు.ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ జి. వీరపాండియన్, ఐఏఎస్, అలాగే ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓలకు వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు మెరుగైన వైద్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, వారి సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపడతామని అశోక్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుమంత్, వెంకటేష్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.