Tuesday, 1 September 2026
  • Home  
  • గౌరవరం ఎస్సీ కాలనీలో పౌరహక్కుల అవగాహన సభ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గౌరవరం ఎస్సీ కాలనీలో పౌరహక్కుల అవగాహన సభ

అనంతసాగరం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామ ఎస్సీ కాలనీలో సోమవారం పౌరహక్కుల దినోత్సవం గ్రామసభను స్థానిక మండల తహసిల్దార్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతసాగరం తహసీల్దార్ వీరవసంతరావు, మండల ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ హాజరయ్యారు. వారితో కలిసి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు నీరుకట్టు శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కాలనీవాసులకు వివరించారు. ఎవరైనా అన్యాయానికి గురైతే భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు నీరుకట్టు శ్రీహరి పాల్గొని కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పెద్దలు, కాలనీవాసులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అనంతసాగరం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి:
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామ ఎస్సీ కాలనీలో సోమవారం పౌరహక్కుల దినోత్సవం గ్రామసభను స్థానిక మండల తహసిల్దార్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతసాగరం తహసీల్దార్ వీరవసంతరావు, మండల ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ హాజరయ్యారు. వారితో కలిసి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు నీరుకట్టు శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కాలనీవాసులకు వివరించారు. ఎవరైనా అన్యాయానికి గురైతే భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు నీరుకట్టు శ్రీహరి పాల్గొని కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ పెద్దలు, కాలనీవాసులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.