నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని అరకులోయ మండలం, గన్నెల పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2,116 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేయించారు. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. మిగిలిన పిల్లలకు అక్టోబర్ 5న మాత్రలు వేయిస్తామని తెలిపారు.

అరకు: నులిపురుగుల నిర్మూలనతో ఆరోగ్యకర ఎదుగుదల