పున్నమి ప్రతినిధి (సెప్టెంబర్ 26):వేముల:
వెంకటేశ్వరపురం, గొండిపల్లి-1, 2 అంగన్వాడి కేంద్రాల్లో అంగన్వాడి ఉత్సవం, పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ తాలూకా ఇన్చార్జి కేశవరెడ్డి తిరుపాల్ రెడ్డి, వేంపల్లి మండల అధ్యక్షులు మొయిళ్ళ ఈశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సౌభాగ్య, రామిరెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపాల్ రెడ్డి సూచించారు. మొయిళ్ళ ఈశ్వర్ రెడ్డి ఆహార, ఆరోగ్య సూచనలు చేశారు. మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడిలో చేర్పించాలని సౌభాగ్య తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ కే.హసీనా పోషకాహారం, పీఎంఎంవీవై ప్రయోజనాలను వివరించారు. ఉత్తమ సేవలందించిన అంగన్వాడి కార్యకర్తలు, సహాయకురాళ్లు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలను సత్కరించారు.





