Sunday, 27 September 2026
  • Home  
  • చెరువులు జలకళ సంతరించుకోవడంతో రంగంపేటలో జలహారతి
- తూర్పు గోదావరి

చెరువులు జలకళ సంతరించుకోవడంతో రంగంపేటలో జలహారతి

రంగంపేట, సెప్టెంబరు 26 (పున్నమి ప్రతినిధి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రంగంపేట మండలంలోని చెరువులు నిండడంతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి, కూటమి నేతలు చెరువుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో గతంలో మండల ప్రజలు తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తాజా వర్షాలతో నీటి కష్టాలు కొంతమేర తొలగిపోయాయని, చెరువులు నిండటంతో సాగు, తాగునీటికి భరోసా ఏర్పడిందన్నారు. వర్షాలు రంగంపేట మండలానికి వరంగా మారగా, ఇతర ప్రాంతాల్లో మాత్రం ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ప్రకృతిని ఎవరూ శాసించలేరని, లభించిన నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న కాలంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు పశువులకు తాగునీటి కొరత లేకుండా చూడాలని ప్రజలకు సూచించారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులు, కలెక్టర్‌ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.