ప్రతి ఒక్క విద్యార్థినీ , విద్యార్థి స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా స్వామి వివేకానంద భావాలను ఆలవర్సుకుని విద్యార్థి దశ నుంచి నైతిక, ఆధ్యాత్మిక విలువలతో మెలగాలని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారీ ఆధ్వర్యంలో స్థానిక ప్రతిభ జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జీవితము, సందేశం పై ఫోటో ఎగ్జిబిషన్ను 12.0 8. 2026 బుధవారం సాయంత్రం మూడు గంటలకు ఏర్పాటు చేసినట్లు గోవిందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ఆయన రచనలు ,సందేశము ద్వారా స్వాతంత్రోద్యమంలో పోరాడి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారని వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం విద్యను అభ్యసించాలని గోవింద రెడ్డి కోరారు. అంతేకాకుండా వారి యొక్క త్యాగనిరతి ,క్రమశిక్షణ, దేశభక్తి లను అలవర్చుకొని వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే మనకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అవుతుందని గోవిందరెడ్డి అన్నారు. కాబట్టి మీరందరూ పేద ప్రజల కోసం ,సమాజం కోసం, దేశం కోసం త్యాగం , సేవ చేస్తూ మహానుభావులు కలలు కన్నా నవభారత నిర్మాణానికి నాంది పలకాలని మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిభా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గారు మాట్లాడుతూ 80వ స్వాతంత్రం దినోత్సవం పురస్కరించుకొని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి ప్రతి స్కూల్స్ లోను, కాలేజీల్లోనూ ముఖ్యంగా ఈ రోజు మా కళాశాలలో ఈ విధంగా పిల్లలకు స్వాతంత్ర సమరయోధులు యొక్క త్యాగము సేవ భావాలను తెలియజేయుట చాలా ఆనందంగా ఉందని కావున ప్రతి ఒక్కరు ఆ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని మహానుభావులు కలలుకన్న భారతదేశాన్ని నిర్మించాలని నారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, విద్యార్థిని ,విద్యార్థులు, శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:

