Tuesday, 8 September 2026
  • Home  
  • స్వర్ణ గ్రామ సచివాలయంలో సిటిజన్ సేవలకు మోక్షం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వర్ణ గ్రామ సచివాలయంలో సిటిజన్ సేవలకు మోక్షం

స్వర్ణ గ్రామ సచివాలయంలో సిటిజన్ సేవలకు మోక్షం వరికుంటపాడు: మండలంలోని స్వర్ణ గ్రామ సచివాలయంలో సిటిజన్ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయని వరికుంటపాడు పంచాయతీ మాజీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ తెలిపారు. ప్రజలు వివిధ ధ్రువపత్రాలు, ప్రభుత్వ సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు పొందే అవకాశం కలిగిందన్నారు. ప్రజల సమస్యను గుర్తించి స్పందించి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను వేగంగా అందించాలని కోరారు. ప్రభుత్వ సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.

స్వర్ణ గ్రామ సచివాలయంలో సిటిజన్ సేవలకు మోక్షం
వరికుంటపాడు: మండలంలోని స్వర్ణ గ్రామ సచివాలయంలో సిటిజన్ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయని వరికుంటపాడు పంచాయతీ మాజీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ తెలిపారు. ప్రజలు వివిధ ధ్రువపత్రాలు, ప్రభుత్వ సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు పొందే అవకాశం కలిగిందన్నారు. ప్రజల సమస్యను గుర్తించి స్పందించి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను వేగంగా అందించాలని కోరారు. ప్రభుత్వ సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.