Friday, 28 August 2026
  • Home  
  • స్వచ్ఛ నెల్లూరు అంటే ఇదేనా?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వచ్ఛ నెల్లూరు అంటే ఇదేనా?

రోడ్ల పై రబ్బిష్ *నెలల తరబడిగా తొలగించని వైనం * ప్రకటనలు ఆకాశంలో * ఫలితాలు పాతాళంలో నెల్లూరు నగర పరిధిలో పారిశుధ్యం రోజు రోజు కు దిగజారుగుతుంది . ఉన్నతాధికారులు పర్యటించే ప్రాంతాల్లో మాత్రమే పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తునందగా అధికారులు పర్యటించని ప్రదేశాలలో పారిశుద్యం పై సంబంధిత సచివాలయ ఉద్యోగులు శానిటేషన్ కార్యదర్సులు ద్రుష్టి పెట్టడం లేదు . దీంతో ఆయా ప్రాంతాలలో పారిశుధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలా నే ఉంటుంది . సిటీ నియోజక వర్గ పరిధిలో ఈ పారిశుధ్య వ్యవస్థ మరింత నిర్లక్ష్యంగా వేళ్లూనుకొని కనిపిస్తుంది . ఉదాహరణకు 16 డిసిషన్ పరిధి లోని వాసవి నగర్ , రావి చెట్టు సెంటర్ 2 వ మెయిన్ రోడ్ కూడలి వద్ద గత కొన్ని నెలల నుంచి టన్నుల కొద్ది పరిణామంలో పెద్ద రబ్బిష్ గుట్ట రోడ్ మీద కనిపిస్తుంది . ఆ రోడ్డున వెళ్లే వందలాదిమంది వాహన దారులకు ప్రజలకు మాత్రం ఈ గుట్ట ఆ గుట్ట తో నిండిన చెత్త అసహ్యంగా కనిపిస్తుందే కానీ సంబంధిత సచివాలయ శానిటేషన్ సెక్రటరీ కి కానీ శానిటేషన్ మేస్త్రీలు , కార్మికులకు కానీ కనిపించక పోవడం గమనార్హం . మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే 8 వ డివిజన్ పరిధిలో ఆర్ ఎస్ ఆర్ పాఠశాల ప్రహరీ గోడ అనుకోని ఉత్తరం వైపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి వెళ్లే రోడ్ మొత్తం రబ్బిష్ గుట్టల తోనే నిండి కనిపిస్తుంది . ఈ సమీపంలోనే అన్న కాంటీన్ ఉన్న కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఆ కాంటీన్ ను అప్పుడప్పుడు తనికీలు చేసి వెళ్తారు కానీ ఈ దావుద్ లో ని రబ్బిష్ గుట్టలను గాని చెత్తను గాని పట్టించుకోని పరిశీలించిన పాపాన పోవడం లేదు .ఇలా చెప్పుకుంటూ పోతే నెల్లూరు నగర పరిధిలో అనేక మారు మూల వీధుల్లో ఇలాంటి పారిశుధ్య చిత్ర విచిత్రాలను ఎన్నో మనం చూడవచ్చు . ఓ వైపు కోట్లు కర్చు చేసి లక్షలు రూపాయలు నెల జీతాలు ఇచ్చి నగర పరిధిలో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి అనుసంధానం చేసి నగర పరిస్థితిని ఎప్పటికి అప్పుడు , ఎక్కడికి అక్కడ గమనిస్తున్నామని చెప్పుకునే కార్పొరేషన్ అధికారులు ఇలాంటి మారు మూల రోడ్ ల పరిస్థితుల పై కూడా ఇకపై దృష్టిపెట్టి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది అని నగర ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు .

రోడ్ల పై రబ్బిష్
*నెలల తరబడిగా తొలగించని వైనం
* ప్రకటనలు ఆకాశంలో
* ఫలితాలు పాతాళంలో నెల్లూరు నగర పరిధిలో పారిశుధ్యం రోజు రోజు కు దిగజారుగుతుంది .
ఉన్నతాధికారులు పర్యటించే ప్రాంతాల్లో మాత్రమే పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తునందగా అధికారులు పర్యటించని ప్రదేశాలలో పారిశుద్యం పై సంబంధిత సచివాలయ ఉద్యోగులు శానిటేషన్ కార్యదర్సులు ద్రుష్టి పెట్టడం లేదు . దీంతో ఆయా ప్రాంతాలలో పారిశుధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలా నే ఉంటుంది . సిటీ నియోజక వర్గ పరిధిలో ఈ పారిశుధ్య వ్యవస్థ మరింత నిర్లక్ష్యంగా వేళ్లూనుకొని కనిపిస్తుంది . ఉదాహరణకు 16 డిసిషన్ పరిధి లోని వాసవి నగర్ , రావి చెట్టు సెంటర్ 2 వ మెయిన్ రోడ్ కూడలి వద్ద గత కొన్ని నెలల నుంచి టన్నుల కొద్ది పరిణామంలో పెద్ద రబ్బిష్ గుట్ట రోడ్ మీద కనిపిస్తుంది . ఆ రోడ్డున వెళ్లే వందలాదిమంది వాహన దారులకు ప్రజలకు మాత్రం ఈ గుట్ట ఆ గుట్ట తో నిండిన చెత్త అసహ్యంగా కనిపిస్తుందే కానీ సంబంధిత సచివాలయ శానిటేషన్ సెక్రటరీ కి కానీ శానిటేషన్ మేస్త్రీలు , కార్మికులకు కానీ కనిపించక పోవడం గమనార్హం . మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే 8 వ డివిజన్ పరిధిలో ఆర్ ఎస్ ఆర్ పాఠశాల ప్రహరీ గోడ అనుకోని ఉత్తరం వైపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి వెళ్లే రోడ్ మొత్తం రబ్బిష్ గుట్టల తోనే నిండి కనిపిస్తుంది . ఈ సమీపంలోనే అన్న కాంటీన్ ఉన్న కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఆ కాంటీన్ ను అప్పుడప్పుడు తనికీలు చేసి వెళ్తారు కానీ ఈ దావుద్ లో ని రబ్బిష్ గుట్టలను గాని చెత్తను గాని పట్టించుకోని పరిశీలించిన పాపాన పోవడం లేదు .ఇలా చెప్పుకుంటూ పోతే నెల్లూరు నగర పరిధిలో అనేక మారు మూల వీధుల్లో ఇలాంటి పారిశుధ్య చిత్ర విచిత్రాలను ఎన్నో మనం చూడవచ్చు . ఓ వైపు కోట్లు కర్చు చేసి లక్షలు రూపాయలు నెల జీతాలు ఇచ్చి నగర పరిధిలో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి అనుసంధానం చేసి నగర పరిస్థితిని ఎప్పటికి అప్పుడు , ఎక్కడికి అక్కడ గమనిస్తున్నామని చెప్పుకునే కార్పొరేషన్ అధికారులు ఇలాంటి మారు మూల రోడ్ ల పరిస్థితుల పై కూడా ఇకపై దృష్టిపెట్టి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది అని నగర ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.