సోమశిల సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి
సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. జలాశయం పూర్తి సామర్థ్యం 77.889 టీఎంసీలు కాగా, మంగళవారం నాటికి 15.487 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో నీటిమట్టం మరింత తగ్గుతుండటంపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటిని సాగు అవసరాలకు అధికారులు విడుదల చేస్తున్నారు. డెల్టా ప్రాంతానికి 1,050 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 300 క్యూసెక్కులు, కావలి కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి త్వరగా వరద నీరు చేరకపోతే రానున్న రోజుల్లో సాగునీటి పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


