నెల్లూరు సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి
విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్, డీఎస్ఆర్ పాఠశాలల్లో పునరుద్ధరించిన భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం కోవూరు మండలం చిన్నపడుగుపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత కోవూరులో టీడీపీ పార్టీ శ్రేణులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.


