Wednesday, 15 April 2026
  • Home  
  • సోమవార పర్వదినం-కాళహస్తిలో నయనానందకరంగా మృత్యుంజయార్చన
- తిరుపతి

సోమవార పర్వదినం-కాళహస్తిలో నయనానందకరంగా మృత్యుంజయార్చన

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి టెంపుల్ న్యూస్) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల విడిపూలు, సుగంధ భరిత పుష్ప మాలలతో నయనానందకరంగా అలంకరించారు. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మృత్యుంజయ స్వామి వారి అభిషేక సేవను కనులారా వీక్షించి, భక్తి పారవశ్యంలో మునిగితేలారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భారీ ఎత్తున తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతా “ఓం నమః శివాయ” నామస్మరణతో మారుమోగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.