Tuesday, 1 September 2026
  • Home  
  • సెయింట్ జేవియర్స్ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
- తిరుపతి

సెయింట్ జేవియర్స్ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

శ్రీ కాళహస్తి, ఆగస్టు 29, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని సెయింట్ జేవియర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గిడుగు రామమూర్తి గారి జీవిత విశేషాలను కొనియాడటంతో పాటు, ఆయనను వ్యావహారిక భాషోద్యమానికి పితామహుడిగా ఎందుకు పిలుస్తారో పాఠశాల తెలుగు భాషా పండితులు విద్యార్థులకు చక్కగా వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఏకపాత్రాభినయాలు, తెలుగు భాషా విశిష్టతను చాటిచెప్పే నాటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాలికలు తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతిబింబించేలా చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ షెర్లి సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, బాలబాలికలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.