సముద్ర దోసకాయ (Sea Cucumber) కణజాలం శరీరం నుంచి వేరుచేసిన తర్వాత కూడా సంవత్సరాల పాటు జీవించగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. సహజ సముద్ర జలంలో ఉంచిన కణజాలం మూడు సంవత్సరాలకు పైగా జీవించి పెరిగినట్లు పరిశోధన వెల్లడించింది. ఇవి నీటిలోని పోషకాలను గ్రహించడమే కాకుండా, రోగనిరోధక కణాల సహాయంతో ఇన్ఫెక్షన్లను ఎదుర్కోగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. జీవకణాల పునరుత్పత్తి, గాయాల మాన్పు వంటి అంశాలపై భవిష్యత్తు పరిశోధనలకు ఈ అధ్యయనం ఉపయోగపడనుంది.

సముద్ర దోసకాయ కణజాలంపై శాస్త్రవేత్తల ఆసక్తికర పరిశోధన